అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన

 *అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన*



*అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు _వై.వి.బి.రాజేంద్రప్రసాద్_ గారి పిలుపు మేరకు ప్రముఖ గిరిజన నాయకుడు పంచాయతీరాజ్ ఛాంబర్  సెక్రటరీ బొర్రా నాగరాజు ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల నుంచి జనరల్ ఫండ్స్ మరియు 14, 15వ ఆర్థిక సంఘం నిధులు సర్పంచులకు చెప్పకుండా దొంగలించిన కారణంగా "అటవీ ప్రాంత గ్రామాలకు చెందిన సర్పంచులు"  భిక్షాటన చేసిన తదుపరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర కొందరు సర్పంచులు "శిరోముండనం" చేయించుకొని, "అర్ధనగ్నంగా ఊరేగుతూ " నిరసన తెలపడం జరిగింది.*


*వారి గ్రామాలకు జరిగిన అన్యాయానికి నిదర్శనంగా రాజకీయ పార్టీలకతీతంగా అధికార పార్టీకి చెందిన వైయస్సార్ పార్టీ సర్పంచులు ఈ ధర్నాలో పాల్గొనడం విశేషం.*